News August 23, 2025
విశాఖ పోలీస్ సిబ్బందికి పదోన్నతులు

విశాఖ కమీషనరేట్ పరిధిలో 29 మంది పోలీస్ సిబ్బందికి పదోన్నతలు లభించాయి. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వారిని శనివారం సత్కరించి, పదోన్నతి ర్యాంకులతో పాటుగా పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని సీపీ సూచించారు. వీరిలో 13మంది హెడ్ కానిస్టేబుళ్లు.. ఏఎస్ఐలుగా,14 మంది కానిస్టేబుళ్ళు.. హెడ్ కానిస్టేబుళ్లుగా, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు.
Similar News
News August 24, 2025
విశాఖలో పోలీసులకు రివార్డులు

విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 122 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.
News August 24, 2025
విశాఖ: ఆర్టీసీలో డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలు

ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ద్వారా డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకం చేపడుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనాయుడు శనివారం వెల్లడించారు. స్త్రీ శక్తి పథకానికి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ, మద్దిలపాలెం, గాజువాక, వాల్తేర్, స్టీల్ సిటీ, సింహాచలం, మధురవాడ డిపోలలో నియామకాలు చేపడుతున్నామని అన్నారు. ఆసక్తి గల వారు ఆయా డిపోల్లో సంప్రదించాలన్నారు.
News August 23, 2025
29న విశాఖకు రానున్న సీఎం చంద్రబాబు

ఈ నెల 29న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి నేరుగా హోటల్ నోవాటెల్‌కు వెళ్తారు. అనంతరం V.M.R.D.A కాంప్లెక్స్‌లు, పర్యాటక శాఖ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభిస్తారు. అమరావతి ఛాంపియన్షిప్ కప్ ఫైనల్ పోటీల విజేతలకు బహుమతులు అందజేసి తర్వాత ప్రో కబడ్డీ పోటీలను ప్రారంభిస్తారని జిల్లా అధికారులు శనివారం తెలిపారు.