News August 16, 2025

విశాఖ ప్రజలకు జీవీఎంసీ కమిషనర్ విజ్ఞప్తి

image

విశాఖ నగరంలో భారీ వర్షాలు ఉన్నందున ఇప్పటికే జీవీఎంసీ అప్రమత్తంతో ప్రత్యేక చర్యలను చేపట్టిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ప్రజలు ఇళ్లలో విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వాడాలని, శిథిలావస్థ భవనాల్లో ఉండరాదని కమిషనర్ సూచించారు. ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే జీవీఎంసీ కంట్రోల్ రూమ్‌ టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 0009కు సమాచారం అందించాలని కోరారు.

Similar News

News August 16, 2025

విశాఖలో బంగారం చోరీ

image

విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్‌లో శనివారం చోరీ జరిగింది. సెక్టార్ 6, 105/bలో నివాసం ఉంటున్న డీజీఎం నల్లి సుందరం తన భార్యతో కలిసి బయటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. ఇంట్లో 24 తులాల బంగారం చోరీకి గురికాగా మరో 40 తులాల బంగారం బిరువాలోనే ఉన్నట్లు తెలిపారు.

News August 16, 2025

పెందుర్తిలో అత్యధిక వర్షపాతం నమోదు

image

పెందుర్తిలోని అత్యధికంగా వర్షపాతం నమోదయింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెందుర్తి పరిసర ప్రాంతాల్లోనీ 66.4 మీ.మీ.వర్షపాతం నమోదయింది. పద్మనాభంలో 28.6 మీ. మీ, ఆనందపురం 15.6 మీ.మీ, ములగాడ 8.2 మీ.మీ., గోపాలపట్నం 7.4 మీ. మీ, విశాఖపట్నం రూరల్ 6.8.మీ.మీ వర్షం పడింది. ఇల్లా వ్యాప్తంగా 24 గంటల్లో 162.0 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News August 16, 2025

విశాఖ: పేలుడు ఘటనలో మరో వ్యక్తి మృతి

image

విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద వెల్డింగ్ దుకాణంలో పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతున్న ముగ్గురులో గంగారావు కేజీహెచ్‌లో శుక్రవారం మృతి చెందాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.