News April 3, 2024
విశాఖ: ‘ప్రత్యేక రైళ్లను జూన్ నెలాఖరు వరకు పొడిగింపు’

వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను జూన్ నెలాఖరు వరకూ కొనసాగించాలని నిర్ణయించినట్టు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ప్రతి సోమవారం విశాఖ నుంచి సికింద్రాబాద్ నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ (08579)ను జూన్ 26 వరకు, తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం సికింద్రాబాద్ నుంచి విశాఖ వచ్చే ఎక్స్‌ప్రెస్ (08580)ను జూన్ 27 వరకు పొడిగిస్తున్నామన్నారు.
Similar News
News October 2, 2025
విశాఖ: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

విశాఖలో భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ 0891-2590100, 0891-2590102 నంబర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి నంబర్ 8500834958, బీమిలి రెవెన్యూ డివిజనల్ అధికారి నంబర్ 8074425598 అందుబాటులో తీసుకువచ్చినట్లు బుధవారం వెల్లడించారు.
News October 1, 2025
విశాఖ జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారిగా ఉమారాణి

విశాఖ ఇంటర్ బోర్డు జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారిణిగా ఉమారాణి నియామకం అయ్యారు. ఇంతవరకు ఈ పదవిలో ఉన్న మజ్జి ఆదినారాయణ పదవీ విరమణ చేయడంతో ఈమెను ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శి నియమించారు. దీంతో బుధవారం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈమె ఇంతవరకు చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించారు.
News October 1, 2025
విశాఖ తీరం కోత నివారణకు రూ.222 కోట్లు: ఎంపీ

విశాఖ తీర ప్రాంత కోత నివారణకు కేంద్రం రూ.222 కోట్లు మంజూరు చేసిందని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ఈ నిధులు కేటాయించారన్నారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ప్రతిపాదనలు, తన విజ్ఞప్తుల మేరకు కేంద్రం స్పందించిందని పేర్కొన్నారు. ఈ నిధులతో తీర సంరక్షణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పిస్తామన్నారు.