News May 3, 2024
విశాఖ ప్రధాన కూడళ్ళలో గ్రీన్ రూఫ్ ఏర్పాటు

విశాఖలోని పలు ప్రధాన జంక్షన్లో వేసవి తాపానికి గాను గ్రీన్ రూఫ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయడంతో వాహనచోదకులకు కొంత ఉపశమనం లభిస్తోంది. ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇలాంటి గ్రీన్ రూఫ్‌లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.
Similar News
News January 29, 2026
గీతం భూముల క్రమబద్ధీకరణపై YSRCP నిరసన

గీతం విద్యాసంస్థల పరిధిలోని రూ.5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని YSRCP భారీ నిరసన చేపట్టింది. బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నేతలు గీతం వద్ద స్థలాన్ని పరిశీలించారు. ఈ కుట్రను అడ్డుకుంటామని పేడాడ రమణికుమారి, కే.కే.రాజు, గుడివాడ అమర్నాథ్, వరుదు కళ్యాణి తదితర ముఖ్యనేతలు స్పష్టం చేశారు.
News January 29, 2026
GVMC స్థాయీ సంఘంలో 160 అంశాలకు ఆమోదం

విశాఖ మేయర్, స్థాయీ సంఘం ఛైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో 159 ప్రధాన, 13 టేబుల్ అజెండాలతో మొత్తం 172 అంశాలు చర్చించారు. అవినీతికి ఆస్కారం ఉన్న 12 అంశాలను వాయిదా వేసి 160 అంశాలకు ఆమోదం తెలిపారు. విశాఖ భాగస్వామ్యం సదస్సు పనులకు ఆమోదం లభించగా, జీవీఎంసీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు.
News January 29, 2026
ఏయూలో భారీ సంగీత సమ్మేళనం.. ఎప్పుడంటే?

ఆంధ్ర విశ్వవిద్యాలయం యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 31న భారీ సంగీత సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ బుధవారం ఆవిష్కరించారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏయూ ఓపెన్ ఎయిర్ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల కళా నైపుణ్యాన్ని చాటేలా ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు వీసీ పేర్కొన్నారు.


