News September 6, 2025
విశాఖ: ఫొటో మార్ఫింగ్ చేసి వేధిస్తున్న యువకుడి అరెస్ట్

మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న యువకుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్లు CP శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖకు చెందిన ఓ మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ అకౌంట్ ద్వారా పంపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ వీడియో కాల్ చేయాలని వేధించడంతో మహిళ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తులో యువకుడు నంద్యాల (D)కి చెందిన వెల్లపు గురునాథ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.
Similar News
News September 6, 2025
భవన నిర్మాణాల అనుమతులతో GHMCకి భారీ లాభం

GHMC భవన నిర్మాణాలకు భారీగా అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో 4,389 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, రూ.759.98 కోట్ల ఆదాయం గడించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చింది రూ.399.61 కోట్లు కాగా.. ఈసారి రూ.360.37 కోట్లు అదనంగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని GHMC అంచనా వేస్తోంది.
News September 6, 2025
విద్యారంగంలో సిద్దిపేటకు ఉత్తమ అవార్డు

విద్యారంగంలో ఓవరాల్‌గా ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా సిద్దిపేట ఎంపికైంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు సాధించినందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి అభినందనలు తెలిపారు.
News September 6, 2025
SKLM: రేపు అటవీశాఖ ఉద్యోగ పరీక్ష

అటవీ శాఖలో పలు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు SKLM రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదివారం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. జిల్లాలో 10 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరిక్షలకు తగ్గా ఏర్పాట్లు చేశామన్నారు.