News April 11, 2025

విశాఖ: బడుగు, బలహీనవర్గాలకు అశాజ్యోతి ఫూలే

image

బడుగు, బలహీనవర్గాలకు అశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఫూలే జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అంటరానితనంపై పోరాటం చేసి, వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సామాజిక సంస్కర్త పూలే అని కొనియాడారు.

Similar News

News September 13, 2025

ఈపీడీసీఎల్ CMD పృథ్వితేజ్‌కి ఏపీ ట్రాన్స్‌కోలో అదనపు బాధ్యతలు

image

విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ ఈపీడీసీఎల్ CMD పృథ్వితేజ్‌ని ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఆర్&అడ్మిన్)గా పూర్తి అదనపు బాధ్యతలపై ప్రభుత్వం నియమించింది.‌ ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ సభ్య కార్యదర్శిగా ఏపీ ట్రాన్స్‌కో (విజిలెన్స్ & సెక్యురిటీ) బాధ్యతలు కూడా అప్పగించింది. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న కీర్తి చేకూరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

News September 12, 2025

విశాఖ: డిజిటల్ మోసం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్

image

విశాఖలో ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరిట మోసం చేసి రూ.1.60 కోట్లు కాజేసిన కేసులో ప్రధాన నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు యూపీలోని బరేలి ప్రాంతానికి చెందిన ఆకాష్ యాదవ్‌ను అరెస్టు చేసి రిమండ్‌కి తరలించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. జూన్ 24న బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News September 12, 2025

విశాఖ: ‘మందుల విక్రయాలు జాగ్రత్తగా నిర్వహించాలి’

image

విశాఖలోని VMRDA చిల్డ్రన్స్ ఏరినాలో డ్రగ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో మందుల దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోలర్ విజయకుమార్ హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణలత పాల్గొని డ్రగ్స్ పై వివరించారు.