News June 29, 2024

విశాఖ: బదిలీల కోసం తహశీల్దారుల ఎదురుచూపు

image

ఎన్నికల ముందు సొంత జిల్లాల్లో పనిచేస్తున్న తహశీల్దారులను ప్రభుత్వం వేరే జిల్లాలకు బదిలీ చేసింది. ఎన్నికల ముగిసిన నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు బదిలీపై వచ్చిన తహశీల్దారులు తమ సొంత జిల్లాలకు వెళ్లడానికి ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారు ఉమ్మడి విశాఖ జిల్లాకు రావడానికి ఎదురుచూస్తున్నారు.

Similar News

News September 21, 2024

యారాడ తీరంలో తప్పిన ఘోర ప్రమాదం

image

యరాడ బీచ్‌లో విదేశీ పర్యాటకులకు ప్రమాదం తప్పింది. ఇటలీ దేశానికి చెందిన 8 మంది విదేశీయులను యారాడ సాగర్ తీరని చేరుకొని ఈత చేయ సాగారు. సముద్రపు అలలు వీరిని లోపలికి లాక్కెళ్లిపోవడంతో మిగిలి ఉన్న ఇటలీ దేశస్తులు అక్కడే ఉన్న స్థానికులకు కేకలు వేశారు. సముద్రంలో కోట్టుకుపోతుండగా లైఫ్ గార్డ్స్‌కు చెందిన సిబ్బంది అక్కడ ఉండడంతో వెంటనే వీరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఏ మాత్రంలేట్ అయినా మొత్తం గల్లంతయ్యేవారు.

News September 21, 2024

భీమిలిలో కట్టడాల కూల్చివేతపై విజయసాయిరెడ్డి స్పందన

image

భీమిలి బీచ్‌లో నిర్మించిన ప్రహరీ రెండో సారి కూలగొట్టడంపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘మంత్రి నారా లోకేశ్, ఎంపీ శ్రీ భరత్ కుమ్మక్కై రాజకీయ కక్షతో మా ప్రైవేట్ స్థలంలో ప్రహరీ పగలగొట్టారు’అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇది పిల్ల చేష్టల పనిగా భావిస్తున్నానని అన్నారు. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు అక్రమ కొంపను ఆ నిబంధనల ప్రకారమే కూల్చమని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు.

News September 21, 2024

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊరట

image

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఊరట లభించింది. ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న దీనికి మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ.500 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు అప్పగించింది.