News May 12, 2024

విశాఖ బీచ్ రోడ్‌లో భారీ నగదు పట్టివేత..!

image

విశాఖ నగరంలో ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా భారీగా తరలిస్తున్న నగదు పట్టివేత కలకలం రేపింది. సుమారు రూ.కోటిన్నర నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలతో ఈ నగదు వ్యవహారం బయటపడింది. విశాఖ ఆర్కే బీచ్‌కు సమీపంలో పాండురంగపురంలోని కారులో తరలిస్తున్న రూ.కోటిన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు. సీ-విజిల్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

Similar News

News January 23, 2025

విశాఖ-దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు కోచ్‌లు కుదింపు

image

విశాఖ-దుర్గ్ వందేభారత్ (20829/30) ఎక్స్‌ప్రెస్‌కు కోచ్‌లు కుదించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఇప్పటివరకు ఈ రైలు 16 కోచ్‌లతో నడిచేది. అయితే జనవరి 24వ తేదీ నుంచి 8 కోచ్‌లతో మాత్రమే నడుస్తుందని ఆయన తెలిపారు. అందులో ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్, ఏడు ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News January 23, 2025

విశాఖ: పుట్టినరోజు నాడే కానిస్టేబుల్ అభ్యర్థి మృతి

image

విశాఖ ఏఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో గురువారం ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది.1,600 మీటర్ల రన్నింగ్ అనంతరం సొమ్మసిల్లి పడిపోయిన శ్రవణ్ కుమార్‌ను నిర్వాహక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు నాడే శ్రవణ్ కుమార్ మృతి చెందటం పట్ల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీస్ అవుతాడానుకుంటే అందరాని దూరాలకు వెళ్లిపోయాడని విలపిస్తున్నారు.

News January 23, 2025

మోడల్ సిటీగా విశాఖను తీర్చిదిద్దాలి: ఆమ్రపాలి

image

విశాఖ మహానగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. గురువారం వీఎంఆర్డీఏలో‌ నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డీపీఆర్‌లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.