News August 17, 2024
విశాఖ: బీజేపీలో చేరిన వైసీపీ రాష్ట్ర మహిళా నేత

వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగలపాటి యువశ్రీ బీజేపీలో చేరారు. శనివారం విశాఖ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ కన్వీనర్ నరసింగరావు ఆధ్వర్యంలో చేరిక జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన నచ్చి బీజేపీలో చేరినట్లు ఆమె తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వివరించారు.
Similar News
News September 22, 2025
భూములిచ్చిన రైతులను ఆదుకుంటాం: CM

గూగుల్ డేటా సెంటర్ కోసం తర్లువాడలో భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని CM చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నగరానికి వచ్చిన ఆయనకు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. డేటా సెంటర్ కోసం రైతులు భూములిచ్చి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారన్నారు. రైతుల విజ్ఞప్తిని పరిశీలించి భూ పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని CM పేర్కొన్నారు.
News September 22, 2025
విశాఖలో కేంద్రమంత్రి స్వాగతం పలికిన కలెక్టర్

28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి (DARPG & DOPPW) జితేంద్రసింగ్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు.
News September 22, 2025
విశాఖలో పిడుగు పడి ఉద్యోగి మృతి

విశాఖలో సోమవారం విషాదం నెలకొంది. మధురవాడ సమీపంలో కొమ్మాది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడి జీవీఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రకాష్(37) మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి పీఎం పాలెం పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.