News October 29, 2024

విశాఖ బీజేపీ నేతలతో కేంద్రమంత్రి బండి భేటీ

image

రోజ్ గార్ మేళాలో పాల్గొనేందుకు విశాఖలో పర్యటిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ నేతల ఆహ్వానం మేరకు నగరంలో పార్టీ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పీవీన్ మాధవ్ తదితరులతో భేటీ అయ్యారు. నగరంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Similar News

News October 31, 2024

విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్

image

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలోని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈవో, వైస్‌ప్రెసిడెంట్‌ను కోరారు. ఏపీలో ఈ- గవర్నెన్స్, డిజిటల్ విద్యకు సహకరించాలని మీటింగ్‌లో ప్రతిపాదించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి తోడ్పాటుతో పాటు స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని మంత్రి లోకేశ్ కోరినట్లు టీడీపీ ట్వీట్ చేసింది.

News October 30, 2024

విశాఖలో సమీక్ష నిర్వహించనున్న సీఎం

image

జిల్లాలో ఈనెల 2వ తేదీన సీఎం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప‌టిష్ఠ ఏర్పాట్లు చేయాల‌ని, స‌మ‌న్వ‌య లోపం లేకుండా చూసుకోవాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్ ఆదేశించారు. బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టరేట్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News October 30, 2024

పర్యావరణహిత దీపావళి జరుపుకోండి: విశాఖ సీపీ

image

పర్యావరణహిత దీపావళిని జరుపుకోవాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. విశాఖలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పశు, పక్షాదులకు, వృద్ధులు, పిల్లలకు హాని కలగకుండా సంప్రదాయ బద్దంగా దివ్వెల పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు.