News October 19, 2025

విశాఖ-బెంగళూరు మధ్య స్పెషల్ రైలు

image

దీపావళి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలును నడపనుంది. అక్టోబర్ 21న ఉదయం 8.20కు విశాఖపట్నం నుంచి బెంగళూరు ఎస్‌ఎమ్‌వీటీకి వన్‌వే స్పెషల్ రైలు (సంఖ్య 08545) బయలుదేరి, అక్టోబర్ 22న ఉదయం 6.45కు చేరుతుంది. దువ్వాడ, అనకాపల్లి,యలమంచిలి, సామర్లకోట రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.

Similar News

News October 20, 2025

అక్టోబర్ 20: చరిత్రలో ఈరోజు

image

1937: హాస్యనటుడు రాజబాబు జననం(ఫొటోలో)
1962: భారత్-చైనా యుద్ధం మొదలు
1978: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జననం(ఫొటోలో)
1990: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోన ప్రభాకర్ రావు మరణం
2008: దర్శకుడు సి.వి. శ్రీధర్ మరణం
2011: నటుడు, గాయకుడు అమరపు సత్యనారాయణ మరణం
➢ప్రపంచ గణాంక దినోత్సవం

News October 20, 2025

ప్రమాదరహితంగా పండుగ జరుపుకోండి: కామారెడ్డి SP

image

కామారెడ్డి జిల్లా ప్రజలకు SP రాజేష్ చంద్ర దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రమాదరహితంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. బాణాసంచా కాల్చే సమయంలో అగ్నిప్రమాదాలు, గాయాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. పర్యావరణహిత టపాకాయలు మాత్రమే ఉపయోగించాలన్నారు. పెద్దల పర్యవేక్షణలోనే టపారకాయలు కాల్చాలన్నారు. అత్యవసరమైతే 101ను సంప్రదించాలని సూచించారు.

News October 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.