News April 3, 2025

విశాఖ: భర్త దాడిలో భార్య మృతి

image

విశాఖలో వివాహిత రమాదేవి చికిత్స పొందుతూ మృతిచెందింది. మాధవధారకు చెందిన రమాదేవి, బంగార్రాజు మధ్య గొడవలు జరగ్గా రమాదేవి పుట్టింటికి వెళ్లింది. గతనెల 30న బంగార్రాజు అక్కడికి వెళ్లి గొడవపడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరగా అడ్డగించి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను KGHకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నిందితుడిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News April 4, 2025

వీఎంఆర్డీఏలో 113 మందికి ప్లాట్ల కేటాయింపు

image

V.M.R.D.A. అధికారులు ఎంఐజి లే అవుట్లోని ప్లాట్లకు గురువారం డ్రా నిర్వహించారు. అడ్డూరు, గరివిడి, పాలవలసల్లో 113 మందికి ఈ-లాటరీలో ప్లాట్లు కేటాయించారు. అడ్డూరులో 146, గరివిడిలో 212, పాలవలసలో 472 ప్లాట్లను V.M.R.D.A. అభివృద్ధి చేసింది. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ల ధరలో 20 శాతం రాయితీ ఇస్తున్నారు.

News April 3, 2025

పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైలు: విశాఖ సీపీ

image

విశాఖ నగర పరిధిలో స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సీపీ కార్యాలయంలో గురువారం అధికారులతో సమావేశమయ్యారు. పొగాకు వల్ల రాష్ట్రంలో ప్రతి ఏడాది 48వేల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రోజుకి 250 మంది పిల్లలు పొగాకు వాడుతున్నారన్నారు. పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైళ్ళు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామన్నారు.

News April 3, 2025

రికార్డు సృష్టించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసిందని జనరల్ మేజేజర్ పరమేశ్వర్ ఫంక్వాలా తెలిపారు. 259.254 మిలియన్ల టన్నుల సరకు రవాణ చేసి కొత్త బెంచ్‌మార్క్‌ను దాటిందని వెల్లడించారు. గతంలో ఉన్న 259 మిలియన్ల టన్నుల మార్కుని దాటిని దేశంలోని మొదటి రైల్వే జోన్‌గా ECoR అవతరించిందని పేర్కొన్నారు. 

error: Content is protected !!