News January 7, 2026

విశాఖ: భర్త మిస్సింగ్.. భార్యే చంపేసిందా?

image

బక్కన్నపాలెం కే2 కాలనీలో అల్లాడ నాగరాజు అదృశ్యం కేసు మిస్టరీ కలకలం రేపుతోంది. గత నవంబర్‌లో భర్త నాగరాజు మిస్ అవగా DEC 9న భార్య రమ్య పీఎంపాలెం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నగలు తీసుకుని పరారయ్యాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయితే విచారణలో రమ్యపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెతో పాటు మరో ముగ్గురిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. హత్యాకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 9, 2026

చెవులు లేకున్నా వింటాయివి!

image

ప్రత్యేక శరీర ఆకృతి, కండరాల నిర్మాణంతో కొన్ని జీవులు బాహ్య చెవులు లేకున్నా వినగలుగుతాయి. పాములకు దవడ ఎముక ద్వారా లోపలి చెవికి సౌండ్ సిగ్నల్స్ అందుతాయి. సాలీడు కాళ్లపై ఉన్న వెంట్రుకలు వైబ్రేషన్స్ విని అపాయాన్ని పసిగడతాయి. సాలమండర్లు చర్మం, వాటి పుర్రె ఎముకలు.. బల్లుల అంతర్గత శరీరాకృతి వల్ల వినగలుగుతాయి. చాలా రకాల చేపలు సైతం అవి తిరిగే ప్రాంతంలో ప్రత్యేకమైన సిస్టమ్ ఏర్పరచుకొని సౌండ్స్ వింటాయి.

News February 9, 2026

VJA: బాండెడ్ లేబర్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

image

బాండెడ్ లేబర్ వ్యవస్థ (రద్దు) చట్టం, 1976 అమలులోకి వచ్చి నేటికి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా కార్మిక కమిషనర్, ఆదేశాల మేరకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టరేట్‌లో బాండెడ్ లేబర్ నిర్మూలనపై జాయింట్ కలెక్టర్ ఇలక్కియా పోస్టర్లను విడుదల చేసి, ప్రతిజ్ఞ చేశారు. అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి విజయవాడలోని బి.ఆర్. అంబేడ్కర్ స్మృతి వనం వరకు నిర్వహించినట్లు తెలిపారు.

News February 9, 2026

దక్షిణ దిశలో ఇల్లు ఉండకూడదా?

image

దక్షిణానికి యముడు అధిపతి కావడంతో ఈ దిక్కున ఇల్లు కడితే అశుభమని చాలామంది భయపడతారు. అయితే ఇది అపోహ మాత్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘దక్షిణాన ఉన్న స్థలం నివాసానికి పనికిరాదనేది నిజం కాదు. నిర్మాణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ దిక్కున ఉన్నవాళ్లు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే యమస్థానం నుంచి కూడా మంచి ఫలితాలను పొందవచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>