News August 31, 2025
విశాఖ: భవనం పైనుంచి జారిపడి మహిళ మృతి

పెద్ద రుషికొండలో భవనం పైనుంచి జారిపడి మృతి చెందింది. ఆరిలోవ ఉంటున్న చందక సత్యాలు (48) భవన నిర్మాణ కార్మికులరాలిగా పనిచేస్తోంది. ఆదివారం ఆదిత్య అపార్ట్‌మెంట్ వెనుక ఉన్న భవనంలో మరమ్మతుల పనులకు వెళ్లింది. అక్కడ పని చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి కిందపడడంతో మృతి చెందింది.
Similar News
News September 3, 2025
విశాఖ: 6న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం

జిల్లా సమీక్షా కమిటీ సమావేశం (డి.ఆర్.సి.) ఈ నెల 6న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికారులతో మంగళవారం విశాఖ కలెక్షరేట్‌లో సమావేశమయ్యారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలక్టరేట్‌లో జరగనున్నట్లు చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
News September 3, 2025
కాన్వెంట్ జంక్షన్ వద్ద ప్రమాదం.. ఒకరి మృతి

కాన్వెంట్ జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రసాద్ గార్డెన్‌కి చెందిన ఏ.శంకర్, నాయిని చిన్న స్కూటీపై గాజువాక వెళ్తున్నారు. కాన్వెంట్ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే సమయంలో బస్సు వెనుక టైర్ల కింద పడ్డారు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన చిన్నాని హర్బర్ ట్రాఫిక్ పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు.
News September 2, 2025
ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ అభివృద్ధి చేస్తాం: సీఎం

విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమ్మిట్ ముగిసింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, లాజిస్టిక్స్ యూనివర్సిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతిని ఎయిర్ కార్గో హబ్‌లుగా అభివృద్ధి చేస్తామని, పోర్ట్ ఆధారిత ఎకానమీతో ఏపీని ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.