News January 17, 2026
విశాఖ-భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ట్రాఫిక్ కష్టాలు

విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సుమారు 45 కిలోమీటర్లు. ప్రస్తుతం నగరం మధ్యగా వెళ్లే నేషనల్ హైవేనే ప్రధాన మార్గంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఆనందపురం జంక్షన్‌కి చేరుకోవడానికే గంటకు పైగా సమయం పడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా కోస్టల్ బీచ్ కారిడార్ రహదారిని ప్రతిపాదించారు. విశాఖ పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు 6 వరుసల రహదారి నిర్మాణం మాస్టర్ ప్లాన్‌లో ఉంది.
Similar News
News February 19, 2026
నిర్మల్ జిల్లాలో మరాఠాల ముద్ర!

శివాజీ నేరుగా ఇటు రాకున్నా మరాఠా బలగాలు గోదావరి తీరం వెంట విస్తృతంగా సంచరించాయి. నాటి సైనిక కదలికల వల్లే నిర్మల్ పరిసరాలతో పాటు ముధోల్, బాసర, లోకేశ్వరం ప్రాంతాల్లో ‘ఆరె మరాఠా’ సమాజం పెద్దఎత్తున స్థిరపడింది. కట్టడాల ఆనవాళ్లు లేకున్నా శివాజీ స్ఫూర్తి, మరాఠా సంస్కృతి ఇక్కడి చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి. వారు నేటికీ జయంతులు ఘనంగా జరుపుతూ ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు.
News February 19, 2026
పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: సీపీ

ఖమ్మం జిల్లాలోని 66 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు సెక్షన్ 163 (BNSS యాక్ట్) అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. పరీక్షల సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని ఆదేశించారు. ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 19, 2026
వనపర్తి: 22న గురుకుల ప్రవేశ పరీక్ష: కలెక్టర్ ఆదర్శ సురభి

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈనెల 22న జరగనుందని కలెక్టర్ ఆదర్శ సురభి వెల్లడించారు. జిల్లాలోని 11 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉ. 11 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందన్నారు. 5వ తరగతితో పాటు 6-9 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ వెంట తెచ్చుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


