News March 19, 2024
విశాఖ: మనస్తాపంతో విద్యార్థి సూసైడ్

విశాఖ నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాథపురంలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి భాను చైతన్య(20) మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో భాను చైతన్య బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. రెండవ సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 21, 2026
ఈస్ట్ కోస్ట్ రైల్వే సరికొత్త రికార్డు

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 324 రోజుల్లోనే 250 మిలియన్ టన్నుల సరకు రవాణాను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి రైల్వే జోన్‌గా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 31 రోజుల ముందే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు రవాణా ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి.
News February 21, 2026
జాతీయ కబడ్డీ పోటీలకు విశాఖ ఆణిముత్యం

విశాఖలో గంగవరం ప్రాంతానికి చెందిన నోళ్లు తేజ 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఎంపికయ్యారు. ఈనెల 24 నుంచి 27 వరకు గుజరాత్‌లోని వడోదరలో జరిగే పోటీల్లో పాల్గొంటారు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన తేజను గాజువాక వాసులు అభినందించారు.
News February 21, 2026
విశాఖలో ఎంఐజీ గృహాల నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ సన్నద్ధం

విశాఖలో మధ్య తరగతి వర్గాల కోసం MIG గృహ సముదాయాలను నిర్మించనున్నట్లు వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ ప్రకటించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలో స్టాల్‌ను ప్రారంభించిన ఆయన, భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కోసం రూ.175 కోట్లతో 7 ప్రధాన రహదారులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగం మరింత వృద్ధి చెందుతుందన్నారు.


