News May 13, 2024
విశాఖ: మరో గంట మాత్రమే ఉంది.. వేకప్

ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ఇప్పటికే అరకు, పాడేరులో పోలింగ్ ముగియగా.. మరో గంటలో మిగిలిన చోట్లు పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
> SHARE IT
Similar News
News October 28, 2025
రేపు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవు

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు 2 రోజులుగా తరగతులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తుఫాను నేపథ్యంలో ఉద్యోగులకు, సిబ్బందికి సైతం మంగళవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో పాఠశాలలకు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు కూడా సెలవు ప్రకటించారు.
News October 28, 2025
మరింత అప్రమత్తంగా ఉందాం: ప్రత్యేక అధికారి

మొంథా తుపాను మంగళవారం రాత్రి 10 నుంచి సుమారు 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు చేపట్టే ముందస్తు జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎంపీ శ్రీభరత్, తదితరులు పాల్గొన్నారు.
News October 28, 2025
జాతీయ రహదారిపై భారీ వాహనాల నిలిపివేత: విశాఖ సీపీ

మొంథా తుఫాను నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీ వాహనాలను మంగళవారం రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. భారీ గాలులు, వర్షం కురిసే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అవసరమైతే తప్ప ప్రయాణం చేయొద్దని ఆయన సూచించారు. ప్రజలు, వాహనదారుల సహకరించాలని కోరారు.


