News March 23, 2025
విశాఖ: మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు

విశాఖలో 2021లో హత్యకు గురైన జి.శ్రీను కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు <<15852353>>మర్డర్ మిస్టరీ<<>>ని ఛేదించారు. జీ.శ్రీను తమ్ముడు తోటయ్య దొంగలించిన ఫోన్‌ను లాలం గణేశ్‌కు అమ్మాడు. దీనిని గణేశ్ తమ్ముడు వాడగా ట్రాక్ చేసిన పోలీసులు తోటయ్యను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం రూ.10,000 ఖర్చు అయిందని శ్రీను గణేశ్‌ను డబ్బులు అడిగే వాడు. దీంతో శ్రీను-గణేశ్ మధ్య వాగ్వాదం జరగ్గా.. అది హత్యకు దారి తీసినట్లు దర్యాప్తులో తేలింది.
Similar News
News March 24, 2025
శారదాపీఠంలోని ప్రభుత్వ భూముల గుర్తింపు నోటీసులు జారీ

శారదా పీఠంలోని ప్రభుత్వ భూములను గుర్తించి నోటీసులు జారీ చేశారు. చిన్నముషివాడ శారదా పీఠంలో సర్వే నెంబర్ 90లో 22 సెంట్లు రాస్తా ఆక్రమించారని, ఏడు నిర్మాణాలు తొలగించి ఖాళీ చేసి వెళ్లిపోవాలని పెందుర్తి తహశీల్దార్ శారద పీఠం మేనేజర్‌కు నోటీసులు అందించారు. ఇప్పటికే పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టారు.
News March 24, 2025
సింహాచలం అప్పన్న పెండ్లిరాట ఎప్పుడంటే?

సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి అనగా వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పెండ్లిరాట మహోత్సవాన్ని ఉగాది పర్వదినాన జనపనున్నారు. ఈనెల 30వ తేదీన సాయంత్రం సుముహూర్త సమయంలో పెండ్లిరాటను వేస్తారు. మండపంలో మధ్యాహ్నం నూతన పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఈ పెండ్లిరాట మహోత్సవాన్ని నిర్వహిస్తారు.
News March 24, 2025
విశాఖ కలెక్టరేట్లో ఫిర్యాదుదారులకు స్నాక్స్

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతలు అందించేందుకు సోమవారం జనం భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకొని ఫిర్యాదుదారులకు మజ్జిగ, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు అందిస్తున్నారు. వృద్ధులకు సైతం ఇబ్బందులు లేకుండా వీల్ ఛైర్లు ఏర్పాటు చేశారు.