News January 31, 2026
విశాఖ: మహిళకి ప్లాస్టిక్ సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్లు

KGH వైద్యులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన R.సాయమ్మ (46) అనే మహిళకు సంక్లిష్టమైన ప్లాస్టిక్ సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు. బొబ్బలి సమీపంలో జరిగిన ప్రమాదంలో సాయమ్మ గాయపడి KGHలో చేరారు. ఆమె దవడ, కంటి చుట్టూ ఎముకలు విరగగా, ప్లాస్టిక్ సర్జరీ, కంటి వైద్య నిపుణులు సమన్వయంతో శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లను సూపరింటెండెంట్ డా.ఐ. వాణి అభినందించారు.
Similar News
News February 8, 2026
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్ ఎన్నికల కోడ్ విడుదలైన నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు పక్కా కార్యాచరణ రూపొందించామని ఆమె తెలిపారు. పోలింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 8, 2026
NZB: రేపాటి నుంచి మద్యం దుకాణాలు బంద్

మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఓటింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని NZB జిల్లా మద్య నిషేధ, అబ్కారీ అధికారి K.మల్లారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు NZB మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు డిపోలు, కల్లు దుకాణాలు, ఆర్మీ క్యాంటీన్, హరిత ఇందూర్ మూసి వేయాలన్నారు.
News February 8, 2026
రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలు: కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలను ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. https://Meekosam.ap.gov.inవెబ్ సైట్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చని, డయల్ 1100కి ఫోన్ చేసి అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. మండలాల వారీగా రెవెన్యూ క్లీనిక్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. అక్కడ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు.


