News December 13, 2024

విశాఖ: మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు అరెస్ట్

image

మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రెండో పట్టణ పోలీసులు గురువారం తెలిపారు. పెందుర్తికి చెందిన జయ గంగాధర కృష్ణ, కే రత్నం, కప్పరాడకు చెందిన శ్యామ్ సుందరరావు యువతలు ఫోటోలను దీపక్‌కు అందజేసేవారు. దీపక్ ఫోటోలను వెబ్ సైట్‌లో పెట్టి ఆ యువతులతో వ్యభిచారం చేయించేవాడు. ఇటీవల దీపక్‌ను అరెస్ట్ చేయగా అతనిచ్చిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ తిరుమలరావు తెలిపారు.

Similar News

News November 8, 2025

విశాఖ: ‘పెండింగ్‌లో ఉన్న నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు వేగవంతం’

image

దసరా, దీపావళి, GST సంస్కరణల సందర్భంగా ప్రజలు వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేశారు. ఎక్కువ సంఖ్యలో వాహనాలు కొనుగోలు జరగడంతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పెండింగ్‌ వలన రవాణా శాఖ కార్యాలయంలో అదనపు సిబ్బందిని వినియోగించి వాహనాలకు శుక్రవారం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించామని DTC R.C.H.శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక నంబర్లు కొనుగోలు చేసిన వారికీ నంబర్లు కేటాయించిన వెంటనే వాటిని అప్రూవల్ చేస్తామన్నారు.

News November 7, 2025

విశాఖ: పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

image

13 నెలలుగా పెండింగ్‌లో ఉన్న రూ.400 కోట్లలో కనీసం 6 నెలల బిల్లులను వెంటనే చెల్లించాలని GVMC కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం GVMC గాంధీ విగ్రహ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి ధర్నా చేపట్టారు. బిల్లులు చెల్లించకపోతే ఇక పనులు చెయ్యలేమన్నారు. GVMC బడ్జెట్ ఉన్న వర్కులకు మాత్రమే టెండర్లు పిలవాలన్నారు. ధర్నా అనంతరం ర్యాలీగా వెళ్లి GVMC కమిషనర్, మేయర్‌‌కు వినతిపత్రం అందజేశారు.

News November 7, 2025

విశాఖ: పాఠశాలలకు రేపు సెలవు రద్దు

image

విశాఖలో రేపు రెండో శనివారం సందర్భంగా సెలవు రద్దు చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో.. ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్ణయించారు. ఈ మేరకు అన్ని మేనేజ్‌మెంట్‌ల పాఠశాలలు రేపు సాధారణంగా పనిచేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.