News September 12, 2025

విశాఖ: మహిళా డాక్టర్‌ను వేధించిన వార్డ్‌బాయ్ సస్పెండ్

image

కేజీహెచ్‌లో వార్డ్ బాయ్ శంకర్రావు తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళా డాక్టర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 10 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆస్పత్రిలోని పైఅధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వార్డ్ బాయ్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ప్రకటన జారీ చేశారు. ఈరోజు ఉదయం కూడా ఓ రోగి పట్ల వార్డ్ బాయ్స్ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.

Similar News

News September 12, 2025

నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వుకాలు నిషేధం: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడైనా నదీ ప్రవాహక ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు నిషేధమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన ఎస్పీ మణికంఠ చందోలు, జేసీలతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆదాయం కోసం కాకుండా ప్రజలకు సులభంగా ఇసుక అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో 45,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నట్లు ఆయన వివరించారు.

News September 12, 2025

ట్రంప్ సన్నిహితుడి హత్య.. ఎందుకు చంపాడంటే?

image

ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ కిర్క్‌ను గన్‌తో కాల్చి చంపిన కేసులో నిందితుడు టేలర్ రాబిన్‌సన్(22)ను US పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు విడుదల చేసిన ఫొటోల్లో ఉన్నది టేలరేనని అతడి తండ్రి గుర్తించి లొంగిపోమని చెప్పాడు. ఓ పాస్టర్‌ను సాయం కోరగా ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ‘కిర్క్ పొలిటికల్, విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడు’ అని హత్యకు ముందు రోజు రాత్రి టేలర్ ఇంట్లో చెప్పినట్లు అతడి తండ్రి తెలిపారు.

News September 12, 2025

గోదావరిఖని నుంచి గోవా.. రయ్.. రయ్..!

image

గోదావరిఖని బస్టాండ్ నుంచి ఈనెల 23వ తేదీ ఉ.10 గంటలకు రాజధాని ఏసీ బస్ మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం అనంతరం గోవా చేరుకుని తిరిగి 28వ తేదీన గోదావరిఖని చేరుకుంటుందని GDK RTC DM నాగభూషణం తెలిపారు. టికెట్ ధర రూ.8,000 ఉంటుందని, పూర్తి వివరాలతోపాటు టికెట్ల రిజర్వేషన్ కోసం 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని కోరారు.