News January 17, 2026

విశాఖ: మాస్టర్ ప్లాన్‌‌కు ముందే ఈ రహదారుల నిర్మాణం

image

విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. అయితే పోర్టు నుంచి భోగాపురం వరకు 6 వరుసల రహదారి నిర్మాణం మాస్టర్ ప్లాన్‌ ఆచరణలోకి రావడానికి ఇంకా సమయం పట్టనుంది. ఈలోగా VMRDA అడవివరం-గండిగుండం, చిప్పాడ-పోలిపల్లి, నేరేళ్లవలస-తాళ్లవలస, బోయపాలెం-కాపులుప్పాడ, గంభీరం రహదారుల నిర్మాణాలను చేపట్టింది. ఇవి పూర్తయితే ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ మెరుగవుతుంది.

Similar News

News March 29, 2026

జహీరాబాద్: పన్నుల వసూళ్లలో వెనుకబాటు!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో వెనుకబడి ఉంది. మొత్తం 22,172 నివాసాల నుంచి రూ. 23.58 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ. 6.24 కోట్లు (26.41%) మాత్రమే వసూలయ్యాయి. మరో మూడు రోజుల్లో రూ.17.14 కోట్లు వసూలు చేయాల్సి ఉందని కమిషనర్ జైత్ రామ్ తెలిపారు. గడువులోగా గృహ, ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించి సహకరించాలని ఆయన కోరారు.

News March 29, 2026

NLG: విషాదం.. చావులోనూ వీడని బంధం

image

ఏడడుగుల బంధం ఆఖరి శ్వాస వరకు వీడలేదు.. అనంత లోకాలకు కూడా ఆ దంపతులు ఒకరి వెంటే ఒకరు పయనమయ్యారు. శాలిగౌరారం మండలం మాదారం కలాన్ గ్రామానికి చెందిన మామిడి ముత్తమ్మ(70) శనివారం వృద్ధాప్యంతో మృతి చెందారు. దశాబ్దాల కాలం పాటు తనకు నీడలా నిలిచిన భార్య ఇక లేదన్న చేదు వార్తను భర్త సైదులు(80) తట్టుకోలేకపోయారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆయన, అర్థాంగి వియోగాన్ని భరించలేక గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.

News March 29, 2026

పాలిటెక్నిక్ కళాశాలతో ఓరుగల్లుకు కీర్తి ప్రతిష్ఠలు!

image

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులుగా ఎదిగి కళాశాలకు కీర్తి తీసుకువచ్చారు. బీహెచ్‌ఈఎల్, ఎచ్‌ఏఎల్, జెన్‌కో, ఎన్‌పీడీసీసీఎల్, ఎచ్‌సీఎల్, డీఆర్‌డీవో, ఇస్రో, ఐడీపీఎల్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
#ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్