News January 18, 2026

విశాఖ: మాస్టర్ ప్లాన్ మార్చిలోనే..!

image

భోగాపురం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని VMRDA మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. అయితే YCP ప్రభుత్వం ప్రకటించిన కొన్ని ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్ భూములకు సంబంధించిన అంశాల్లో ఎక్కువ మందికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూటమికి ఫిర్యాదులు అందాయి. ఈ అభ్యంతరాలపై సమీక్షించిన అనంతరం మార్చి నాటికి మాస్టర్ ప్లాన్‌ను ప్రకటిస్తామని VMRDA స్పష్టం చేసింది.

Similar News

News January 31, 2026

బ్లూ ఎకానమీ అభివృద్ధికి విశాఖ కీలకం: జీతేంద్ర సింగ్

image

దేశ బ్లూ ఎకానమీ అభివృద్ధిలో విశాఖ తీర ప్రాంతం కీలకమని కేంద్ర సహాయ మంత్రి డా. జీతేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఏపీలో వెయ్యి కి.మీ.లకు పైగా తీరం ఉందన్నారు. విశాఖ తీరం దేశ శక్తి భద్రతకు దోహదపడుతుందన్నారు. విశాఖలో తాజాగా ప్రారంభమైన CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కేంద్రం, ONGC, ఆయిల్ ఇండియా సంస్థలతో కలిసి పనిచేస్తూ మత్స్య, పోర్టు, పారిశ్రామిక రంగాలకు శాస్త్రీయ మద్దతు అందిస్తుందని వెల్లడించారు.

News January 30, 2026

విశాఖ: డిప్యూటీ సీఎంను కలిసిన మత్స్యకారులు

image

బంగ్లాదేశ్ సముద్రజలాల్లో పొరపాటున ప్రవేశించిన విశాఖ మత్స్యకారులను అరెస్టు చేసి నిర్బంధించిన విషయం తెలిసిందే. వారిని విడిపించడంలో AP ప్రభుత్వం చూపించిన చొరవగాను మత్స్యకార మహిళలు, పెద్దలు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్‌ని ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో మత్స్యకార మహిళలు కలిశారు. అనంతరం స్థానికంగా సమస్యలు వివరించారు. గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

News January 30, 2026

క్రిప్టో కరెన్సీ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: విశాఖ సీపీ

image

నగరంలో వెలుగుచూస్తున్న క్రిప్టో మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ సూచించారు. నకిలీ యాప్‌లు, వాట్సాప్ లింకులతో మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అధిక లాభాల ఆశచూపే ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ నమ్మవద్దని, వెబ్‌సైట్లలో స్పెల్లింగ్ తప్పులుంటే అవి ఫేక్ అని గుర్తించాలని కోరారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, మోసపోతే వెంటనే నం.1930 ఫిర్యాదు చేయాలని సూచించారు.