News February 9, 2025
విశాఖ-ముంబై LTT రైలు రద్దు: డీసీఎం

విశాఖ నుంచి ముంబై వెళ్లే LTT రైలును(18519/20) ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. కాజీపేట్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడం వలన రైలును రద్దు చేసినట్లు వెల్లడించారు. ముంబై నుంచి విశాఖ వచ్చే రైలు కూడా ఫిబ్రవరి 12 నుంచి 22వరకు రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News March 13, 2025
సలహాలు, సూచనలు ఇవ్వండి: విశాఖ కలెక్టర్

ఈఆర్వో, డీఈవో, సీఈవో స్థాయిలో పరిష్కారంకాని ఏవైనా సమస్యలపై భారత ఎన్నికల సంఘానికి నేరుగా సూచనలు ఇవ్వొచ్చని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఆహ్వానం తెలుపుతూ ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ వివరించారు. రాజకీయ పార్టీలకు విడివిడిగా ఎన్నికల సంఘం లేఖలు పంపినట్లు పేర్కొన్నారు.
News March 12, 2025
విశాఖలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఉపాధి

స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉపాధి, శిక్షణ కల్పిస్తున్నట్లు సీఈవో ఇంతియాజ్ ఆర్షేడ్ బుధవారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 15వ తేదీలోపు ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సముదాయంలో ఉన్న ఆఫీసులో సంప్రదించాలని కోరారు. ఐటిఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
News March 12, 2025
గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సాయం: కలెక్టర్

విశాఖ జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు బుధవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ఇళ్లు మంజూరై ఇంకా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లకు సాయం అందిస్తామన్నారు. యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.