News August 9, 2025
విశాఖ: మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేత

విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద బొక్క వీధిలోని వెల్డింగ్ దుకాణంలో సిలిండర్ పేలిన ఘటనల్లో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలను హోం మంత్రి అనిత పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. వెల్డింగ్ దుకాణాల్లో పేలుళ్లు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై దుకాణాల యజమానులకు కార్మికులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.
Similar News
News August 9, 2025
విశాఖలో వృక్షా బంధన్

దేశవ్యాప్తంగా 11004కు పైగా ప్రదేశాల్లో వృక్షా బంధన్ కార్యక్రమాలు జరిగాయని గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జె.వి.రత్నం తెలిపారు. శనివారం ఎంవీపీ కాలనీలో విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కట్టారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విశాఖలో 60 వేల విత్తన రాఖీలు విద్యార్థులు తయారు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పిలుపుతో విత్తన రాఖీల ఉద్యమం దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని రేకెత్తించిందన్నారు.
News August 8, 2025
థీమ్ బేస్డ్ టౌన్ షిప్‌లుగా కొత్తవలస, శొంఠ్యాం: VMRDA

భీమిలి మండలం కొత్తవలస, ఆనందపురం మండలం శొంఠ్యాం థీమ్ బేస్డ్ టౌన్ షిప్‌లుగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశామని VMRDA కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ తెలిపారు. జిల్లాలో మరో రెండు ప్రదేశాలను గుర్తించనున్నామని చెప్పారు. ప్రత్యేక రంగాల ఆధారంగా అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచడం, ఆర్థిక వికాసం వీటి లక్ష్యంగా పేర్కొన్నారు.
News August 8, 2025
‘మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులను పూర్తి చేయండి’

విశాఖలో 24/7 మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు నీటి సరఫరాను అందించాలని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం ఆదేశించారు. డిసెంబర్ 31 నాటికి పూర్తిస్థాయిలో పనులను పూర్తి చేయాలన్నారు. మాధవధార, మురళీనగర్‌లో 24/7 నీటి సరఫరా ప్రారంభమైందని, వారు వినియోగిస్తున్న నీటికి బిల్లులు ఇవ్వాలని సూచించారు. వినియోగదారులు ఎంత నీటిని వినియోగిస్తున్నారనే విషయాన్ని వివరించాలన్నారు.