News March 21, 2025
విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు: మంత్రి

విశాఖ ప్రజాప్రతినిధులతో పట్టణాభివృద్ధిశాఖా మంత్రి నారాయణ శుక్రవారం సమావేశమయ్యారు. వీఎంఆర్డీఏ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
Similar News
News December 21, 2025
వేములవాడ: ఈనెల 24న అరుణాచలం ప్రత్యేక యాత్ర ……

వేములవాడ నుంచి తమిళనాడులోని అరుణాచల క్షేత్రానికి ఈనెల 24వ తేదీన ప్రత్యేక బస్సు యాత్ర ఏర్పాటు చేసినట్లు వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 25న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 26న అరుణాచలం గిరి ప్రదక్షిణ, 27న తిరుమల, 28న జోగులాంబ అమ్మవారి దర్శనం ఉంటాయని, పెద్దలకు రూ. 6100, పిల్లలకు రూ.4850 చార్జీ ఉంటుందని వెల్లడించారు. వివరాలకు 99959225926 నంబర్ లో సంప్రదించాలన్నారు.
News December 21, 2025
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLCIL) 30 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్మీ/నేవీ/IAFలో పనిచేసిన అభ్యర్థులు DEC 22 నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 43ఏళ్లు. నెలకు జీతం రూ.20,000-రూ.81,000 చెల్లిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in/
News December 21, 2025
నల్గొండ: మీరు మారరా..?

ఉమ్మడి జిల్లాపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు. అవినీతికి అండగా నిలిచే ప్రధాన శాఖలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఒక్క ఏడాదిలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15కు పైగానే కేసులు నమోదయ్యాయి. బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఏసీబీ వరుసగా దాడులు చేస్తూ జైలుకు పంపుతున్నా, చాలామంది అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం.


