News April 22, 2025
విశాఖ: మేడ మీద నుంచి పడి వివాహిత మృతి

మేడ మీద బట్టలు ఆరవేయడానికి వెళ్లి వివాహిత మృతి చెందిన ఘటన విశాఖలో సోమవారం చోటుచేసుకుంది. 61వ వార్డు ఇండస్ట్రీ కాలనీలో నివాసముంటున్న కోమలి తన ఇంటి మూడో అంతస్తులో బట్టలు ఆరవేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కళ్యాణి ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త శ్రీనుబాబు మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News September 12, 2025
విశాఖలో V-PULL వ్యవస్థ బలోపేతం: జీవీఎంసీ కమిషనర్

జీవీఎంసీ బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్-2025లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 50 ఫైనలిస్ట్ నగరాల్లో ఒకటిగా నిలిచిందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన V-PULL వ్యవస్థను బలోపేతం చేసి సంస్థాగతం చేయాలని గురువారం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సూచించారు. ప్రజలు, నిపుణులు, సంస్థలు కలిసి కో-క్రియేషన్ పద్ధతిలో పట్టణ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని జీవీఎంసీ కమిషనర్ పిలుపునిచ్చారు.
News September 11, 2025
ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా రామకృష్ణ ప్రసాద్

ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీవో)గా రిటైర్డ్ ఎస్పీ కె.వి.రామకృష్ణ ప్రసాద్ గురువారం విశాఖలోని సమస్త ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై 31 వరకు ఆయన సీవీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన్ని మరో ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిలో సీవీవోగా ప్రభుత్వం నియమించింది. సంస్థ సీఎండీ పృథ్విరాజ్‌ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
News September 11, 2025
తెలుగు వారికి అండగా ఉంటాం: పల్లా శ్రీనివాస్

టీడీపీ ఎల్లప్పుడూ తెలుగు వారి యోగా క్షేమాలు చూస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం నారా లోకేశ్ అన్ని ఏర్పాట్లు చేశాలని తెలిపారు. వారిని వైజాగ్ తీసుకొచ్చి వారి ప్రాంతాలకు పంపే ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రుషికేశ్‌లో వరదల సమయం, ఉక్రెయిన్ వార్ సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితిలో తెలుగు వారికి టీడీపీ అండగా ఉందని గుర్తు చేశారు.