News April 4, 2025

విశాఖ మేయర్ పీఠంపై ఎవరి ధీమా వారిదే..!

image

విశాఖ మేయర్ పీఠంపై ఎవరి ధీమా వారికే ఉంది. మొత్తం 98 కార్పోరేషన్లకు గాను ఒక స్థానం ఖాళీగా ఉంది. 14 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి 111 ఓట్లు ఉన్నాయి. అవిశ్వాసం నెగ్గాలంటే 2/3 సభ్యుల మద్ధతు అవసరం. ఇప్పటికే 71 మంది మద్ధతు తమకు ఉందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. YCP కార్పొరేటర్లు తమతోనే ఉన్నారని ఆ పార్టీ పెద్దలు చెప్తుతున్నారు. మరి వీరిలో ఎవరు నెగ్గుతారో చూడాలంటే ఈనెల 19 వరకు ఆగాల్సిందే.

Similar News

News April 11, 2025

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే: కలెక్టర్

image

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. గ్రీన్‌పార్క్ జంక్షన్ వద్ద గల శుక్రవారం ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలబాలికల పాఠశాలల ఏర్పాటు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై ఆయన చేసిన కృషి వర్ణణాతీతమని ప్రశంసించారు. అనంతరం బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి సబ్సిడీ చెక్కు అందించారు.

News April 11, 2025

విశాఖ: రేపే ఇంటర్ ఫలితాలు

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విశాఖ జిల్లాలో ఫస్టియర్ 42,257 మంది, సెకండియర్ 40,744 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 83,001 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

విశాఖ: బడుగు, బలహీనవర్గాలకు అశాజ్యోతి ఫూలే

image

బడుగు, బలహీనవర్గాలకు అశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఫూలే జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అంటరానితనంపై పోరాటం చేసి, వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సామాజిక సంస్కర్త పూలే అని కొనియాడారు.

error: Content is protected !!