News March 27, 2025

విశాఖ మేయర్ పీఠంపై ‘యాదవుల’ పట్టు..!

image

జీవీఎంసీ మేయర్‌గా గొలగాని హరి వెంకట కుమారిని కొనసాగించాలని విశాఖ జిల్లా యాదవ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, ఆ స్థానాన్ని యాదవులకే ఇవ్వాలన్నారు. జీవీఎంసీలో 22 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఉన్నారన్నారు. ఏ సామాజిక వర్గంలో ఇంత మంది కౌన్సలర్లు లేరని గుర్తుచేశారు. 

Similar News

News March 30, 2025

విశాఖ క్రికెట్ స్టేడియంలో శిలాఫ‌లకం ఆవిష్క‌ర‌ణ‌

image

విశాఖ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆదివారం స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణ పనుల శిలాఫ‌లకం ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ శిలాఫ‌లాకాన్ని మంత్రి నారా లోకేశ్ చేతులు మీదుగా ఆవిష్కరించారు. క్రీడాలకు కూటమి ప్రభుత్వం హయాంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఏసీఏ అధ్య‌క్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఉన్నారు.

News March 30, 2025

సింహాచలం అప్పన్న సన్నిధిలో పంచాంగ శ్రవణం

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ వారి దేవస్థానంలో ఉగాది ఆస్థానం విశేషంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారిని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ అలంకారి శ్రీ సీతారామచార్యులు పంచాంగ శ్రవణం చేశారు.ఈ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా పడతాయని, రైతులకు పంటలు సకాలంలో చేతికి అందుతాయన్నారు. అనంతరం దేవస్థానం పంచాంగాలు అందరికీ అందించారు.

News March 30, 2025

వైజాగ్ మ్యాచ్ చూసేందుకు జైషా

image

విశాఖ వేదికగా జరుగుతున్న SRH-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను చూసేందుకు ఐసీసీ ఛైర్మన్ జై షా స్టేడియానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి లోకేశ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆయన వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏసీఏ అధికారుల చేశారు. వచ్చే విమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ విశాఖలో జరిపేందుకు సన్నాహాలు జరుపుతున్న నేపథ్యంలో ఆయన స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 

error: Content is protected !!