News April 19, 2025
విశాఖ మేయర్ పీఠం.. పార్టీల బలాబలాలు

మరికొద్ది గంటల్లో విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడనుంది. 2021లో జరిగిన GVMC ఎన్నికల్లో YCP 58 స్థానాలు నెగ్గి మేయర్ పీఠం కైవశం చేసుకుంది. TDP-30, JSP-3, CPM, CPI ఒక్కో స్థానం గెలిచాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమీకరణాలు మారాయి. దీంతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కూటమికి సుమారు 64 మంది, YCPకి 30 మంది కార్పొరేటర్‌లున్నారు. ఈ ఓటింగ్‌కు కమ్యూనిస్ట్ పార్టీలు దూరంగా ఉంటున్నాయి.
Similar News
News April 19, 2025
సమిష్టి కృషితో విజయం సాధించాం: గంటా

కూటమి ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరి సమిష్టి కృషితోనే విజయం సాధించామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శనివారం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీపై పూర్తి వ్యతిరేకతతోనే కూటమిలో ఆ పార్టీ కార్పొరేటర్లు చేరారని అన్నారు. జీవీఎంసీకి మంచి రోజులు రానున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో జీవీఎంసీలో అభివృద్ధి కుంటిపడిందన్నారు.
News April 19, 2025
ఆ 27మందిపై అనర్హత వేటు వేయండి: వైసీపీ

జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్‌ను వైసీపీ నేత తైనాల విజయ్ కుమార్ కలిశారు. విప్ ధిక్కరించిన 27 మంది కార్పొరేటర్లపై ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ కాన్ఫిడెన్స్ ఇన్ మేయర్ రూల్స్-2008 ప్రకారం వైసీపీ గుర్తుపై గెలిచి కూటమికి మద్దతు ఇవ్వడం ప్రొసీడింగ్స్ ప్రకారం తప్పని.. 27మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. విప్ కాపీని అందజేశారు.
News April 19, 2025
విశాఖ అభివృద్ధే సీఎం లక్ష్యం: మంత్రి డోలా

వైసీపీ 5 ఏళ్ల పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి శూన్యమని విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శనివారం ఆయన జీవీఎంసీలో మేయర్‌పై అవిశ్వాసం నెగ్గిన సందర్భంగా కూటమి కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. వైసీపీ అరాచకాలు అడ్డుకునేందుకే కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.