News May 1, 2024
విశాఖ: ‘మే 5 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్’

ఎన్నికల విధుల్లో భాగమయ్యే అధికారులు, సిబ్బందికి మే నెల 5 ,6, 7 తేదీల్లో ఏయూలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 7, 8 తేదీల్లో పోలీసు, రవాణా ఇతర అత్యవసర సేవల విభాగాలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నారు. మొత్తం 11,221 మంది దరఖాస్తు చేసుకున్నారని సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.
Similar News
News August 5, 2025
విశాఖ: రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రౌండ్ సర్కిల్ వద్ద రోడ్డుపై నడుస్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News August 4, 2025
నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా పిల్లల దత్తత: కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం పిల్లల దత్తత ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దత్తత తీసుకోవాలనుకునే వారు పాన్ కార్డు, ఆదాయ, వయస్సు, నివాస, వివాహ, ఆరోగ్య ధృవీకరణ పత్రాలను సమర్పించాలన్నారు. దత్తత తీసుకోవాలనుకునే వారు ICDS అధికారులను గానీ wws.cara.wcd.gov.in వెబ్ సైట్‌ను సంప్రదించచాలన్నారు.
News August 4, 2025
దువ్వాడ: బిచ్చగాడిని హత్య చేసిన కేసులో నిందితుడి అరెస్టు

దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో బ్రిడ్జి వద్ద గత నెల 31న బిచ్చగాడు మనోజ్‌ను దారుణంగా హత్య చేసిన ఘటనలో దేవరాజ్ అనే వ్యక్తిని దువ్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. 31న రాత్రి బిచ్చగాడు మనోజ్, దేవరాజ్ కలిసి మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో మనోజ్‌ను చంపేసి దేవరాజ్ పరారయ్యాడు. దువ్వాడ పోలీసులు గాలించి నిందితుడ్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.