News March 23, 2026
విశాఖ: యాక్సిడెంట్.. తల్లి కళ్ల ఎదుటే కుమార్తె మృతి

పాత గాజువాక జంక్షన్‌లో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. కొరమండల్ ప్రాంతానికి చెందిన తల్లి కూతుర్లు స్కూటీపై వెళుతుండగా లారీ ఢీకొనడంతో కుమార్తె మల్లపురెడ్డి స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో గాజువాక జంక్షన్‌లో కలకలం రేగింది. కళ్ల ఎదుట కూతురు చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లి పోయింది. ఈ ప్రమాదంలో తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 13, 2026
కామారెడ్డి: అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలి

అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి సుధాకర్ అన్నారు. సోమవారం జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి సుధాకర్ అగ్నిమాపక కార్యలయంలో ఏర్పాటు చేసిన సమవేశంలో మాట్లాడారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సేఫ్ స్కూలు, సేఫ్ హాస్పిటల్, సేఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ తదితర అంశాలపై వివరించారు.
News April 13, 2026
తిరుచానూరులో TDP నేతల వసూళ్లు: YCP

తిరుచానూరులో అమ్మవారి ఆలయం వద్ద టీడీపీ నేతలు వసూళ్ల దందా చేస్తున్నారని వైసీపీ మండిపడింది. ‘ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన భక్తులపై పాశవికంగా దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ గూండాలు మరింతగా రెచ్చిపోతున్నారు. భక్తులు ఇంత ఇబ్బంది పడుతున్నా టీటీడీ చోద్యం చూస్తోంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది.
News April 13, 2026
సంగారెడ్డి: PMISతో ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం

సంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని ఇంటర్న్‌షిప్ పథకం(PMIS) అమల్లో ఉందని డీఐసీ జనరల్ మేనేజర్ తెలిపారు. 18-25 ఏళ్ల మధ్య 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ అభ్యర్థులు అర్హులు. డిగ్రీ ఫైనల్ ఇయర్, దూరవిద్య విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం రూ.12 లక్షలలోపు ఉండాలి. 6-9 నెలలపాటు నెలకు రూ.9,000 స్టైఫండ్ లభిస్తుంది. పూర్తి వివరాలకు pminternship.mca.gov.in ను సంప్రదించాలి.


