News October 29, 2024
విశాఖ: రంజీ మ్యాచ్‌లో ఆంధ్రా టీం ఓటమి

విశాఖలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ టీం 38 పరుగుల తేడాతో ఆంధ్రా జట్టుపై విజయం సాధించింది. 158 ఓవర్లలో 500 పరుగులు చేసిన హిమాచల్‌ప్రదేశ్ జట్టు 156 పరుగులు ఆధిక్యం సాధించింది. కెప్టెన్ రిషి ఆర్ ధావన్ 318 బంతుల్లో 19 ఫోర్లు, రెండు సిక్సులతో 195 పరుగులతో నాట్ అవుట్‌గా నిలిచారు. అనంతరం ఆంధ్ర జట్టు 32.1 ఓవర్లలో 118కి ఆలౌట్ అయ్యి 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Similar News
News September 19, 2025
జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన మేయర్ బృందం

జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు విశాఖ మేయర్ బృందం శుక్రవారం సందర్శించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం, జోధ్ పూర్ మేయర్ వనిత సేధ్, కమిషనర్ సిధ్దార్థ పళనిచామితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి వనరులు, పచ్చదనం, వ్యర్ధాల నిర్వహణ వంటి అంశాలపై తెలుసుకున్నారు.
News September 19, 2025
దేవీ మండపాలకు సింగిల్ విండో అనుమతులు: విశాఖ సీపీ

విజయదశమి దేవీ మండపాల ఏర్పాటుకు https://durgautsav.net వెబ్ సైట్ ద్వారా సింగిల్ విండో పద్ధతిలో అనుమతి తీసుకోవాలని పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చీ తెలిపారు. జీవీఎంసీ, ఫైర్, విద్యుత్ విభాగాల సమన్వయంతో ఈ పోర్టల్ని ఏర్పాటు చేశామన్నారు. నిర్వాహకులు మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయ్యి, వివరాలు నమోదు చేయాలని కోరారు. మండపాలకు క్యూఆర్ కోడ్ ఇస్తారని, దాన్ని మండపాలు వద్ద ప్రదర్శించాలని తెలిపారు.
News September 19, 2025
యారాడ కొండపై కనకదుర్గమ్మ.. ప్రత్యేక బోటు ఏర్పాటు

యారాడ కొండపై వేంచేసి ఉన్న శ్రీసాగర్ గిరి కనక దుర్గ అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు ఈఉత్సవాలు జరగనున్నాయి. పోర్టు వెంకటేశ్వరస్వామి ఆలయ జెట్టీ నుంచి యారాడకు ప్రత్యేక బోట్ సౌకర్యం కల్పిస్తారు. గత ఏడాది టికెట్ ధర రూ.40గా ఉంది. గాజువాక, సింధియా మీదుగా రోడ్డు మార్గంలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు.