News June 26, 2024

విశాఖ-రాజమండ్రి మధ్య ఆర్టీసీ అదనపు బస్సులు

image

ప్రయాణికుల డిమాండ్ నేపథ్యంలో ఆర్టీసీ మంగళవారం విశాఖ నుంచి రాజమండ్రికి 12 ప్రత్యేక సర్వీసులు నడిపింది. నిడదవోలు-కడియం స్టేషన్‌ల మధ్య రైల్వేట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దుచేయడంతో బస్సులకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రస్తుతం విశాఖ- రాజమండ్రి మధ్య ప్రతి 40 నిమిషాలకు నడుస్తున్న బస్సులకు మించి డిమాండ్ ఉండడంతో 12 ప్రత్యేక సర్వీసులు నడిపారు. బుధవారం కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది.

Similar News

News June 29, 2024

విశాఖ: టోల్ ఛార్జీ వసూళ్లను నిలిపివేసిన ఆర్టీసీ

image

విశాఖ జిల్లా అగనంపూడి వద్ద టోల్ గేట్ ఎత్తివేయడంతో ఆ రూట్‌లో ప్రయాణించే ప్రయాణికుల నుంచి ఆర్టీసీ టోల్ ఛార్జీల వసూళ్లకు నిలిపివేసింది. విశాఖ ఆర్టీసీ రీజియన్ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి అనకాపల్లి, రాజమండ్రి, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు ప్రయాణికుల నుంచి ఆర్టీసీ రూ.5 నుంచి రూ.10 వరకు టోల్ ఛార్జీలు వసూలు చేసేది. ఈ మేరకు టికెట్ ఇష్యూ మెషీన్‌లో సాఫ్ట్‌వేర్‌ను సవరించారు.

News June 29, 2024

విశాఖ: డ్రెడ్జ్-8 నౌకకు అత్యవసర మరామత్తులు పూర్తి

image

విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో కేవలం ఐదు రోజుల్లోనే అత్యవసర డ్రై డాకింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన డ్రెడ్జ్-8 నౌక అత్యవసర మరమ్మతుల కోసం ఈనెల 21న తీసుకువచ్చారు. సంస్థ అధికారులు, సిబ్బంది 24 గంటల ప్రణాళికతో ఐదు రోజుల్లో పనులు పూర్తి చేశారు. ఈ నౌకను 1977లో నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

News June 29, 2024

డైట్‌లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్: ప్రిన్సిపల్

image

డైట్లో డిప్లమో కోర్స్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌కు ఈనెల 30 నుంచి జూలై 4 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని భీమిలి డైట్ ప్రిన్సిపాల్ ఎం.జ్యోతి కుమారి తెలిపారు. మొదటి విడత వెబ్‌ఆప్షన్స్ ఇవ్వనివారు, మొదటి విడతలో సీటు రానివారు.. ఈ అవకాశం వినియోగించుకోవచ్చని చెప్పారు. వీరికి జూలై 5 నుంచి ఏడో తేదీ వరకు సీట్లు కేటాయింపు ఉంటుందని, జూలై 9 నుంచి 13 వరకు ప్రవేశాలు కల్పిస్తామని జ్యోతికుమారి తెలిపారు.