News March 23, 2025
విశాఖ రానున్న మంత్రి కందుల దుర్గేష్

ఏపీ రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం విశాఖ రానున్నారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు రుషికొండ బీచ్ ప్రాంతానికి వస్తారు. అనంతరం ఋషికొండ దగ్గర బ్లూ ఫ్లాగ్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి విశాఖ సర్క్యూట్ హౌస్‌కి వెళ్లి ముఖ్య నాయకులతో సమావేశమై సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి గన్నవరం వెళ్లనున్నారు.
Similar News
News March 25, 2025
విశాఖ : ఈ స్థానాలలో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ నగరం కార్ షెడ్ , కొమ్మాది, రుషికొండ, సింహాచలం, దువ్వాడ, కూర్మన్నపాలెం, పాత గాజువాక, షీలానగర్, మర్రిపాలెం, ద్వారకానగర్ స్థానాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
News March 25, 2025
విశాఖ: ఫ్రీ పార్కింగ్.. ఏప్రిల్ 1 నుంచి అమలు

విశాఖలోని వాణిజ్య సముదాయలు, మాల్స్, మల్టీప్లెక్సుల్లో అడ్డగోలుగా పార్కింగ్ ఫీజును వసూలు చేయరాదని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి. వాణిజ్య సముదయాలలో వస్తువులు కొనుగోలు చేసి బిల్లులు చూపిస్తే 30 నిముషాలు, మల్టిఫ్లెక్స్‌లో సినిమా టికెట్ చూపిస్తే గంటసేపు పార్కింగ్ చేసుకోవచ్చుని ఉత్తర్వులలో పేర్కోంది.
News March 25, 2025
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న విశాఖ జిల్లా కలెక్టర్

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో మూడో విడత కలెక్టర్ల సదస్సు మంగళవారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. విశాఖ జిల్లా అభివృద్ధి, పీ-4 సర్వే పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు.