News October 28, 2025

విశాఖ రానున్న మంత్రి గొట్టిపాటి

image

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం సాయంత్రం నగరానికి రానున్నారు. తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి ఒంటిగంటకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. అనంతరం నగరంలోని పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మెరుగైన సేవలు అందించేందుకు మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

Similar News

News October 28, 2025

మూడసర్లోవ రిజర్వాయర్‌కు జలకళ

image

మొంథా తుపాను నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని ప్రధాన జలాశయం ముడసర్లోవ జలకళను సంతరించుకుంది. ఈ జలాశయం సామర్థ్యం 170 అడుగులు కాగా.. మంగళవారం ఉదయం నాటికి 163 అడుగులకు నీరు చేరుకుంది. ఆదివారం 157 అడుగుల వరకు నీరు ఉండేది. సామర్థ్యానికి మించి ఇన్ఫ్లో ఉంటే నీరు విడిచి పెట్టే అవకాశం ఉంది.

News October 28, 2025

అవసరమైతే బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు చేర్చాలి: కలెక్టర్

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారిని బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు చేర్చాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. విశాఖలో 58 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేయాలన్నారు. మేఘాద్రి గడ్డ దిగువ ప్రాంతాల వాసులను అప్రమత్తం చేయాలని కోరారు.

News October 27, 2025

ఏసీబీ వలలో జీవీఎంసీ ఆర్‌ఐ, సచివాలయ సెక్రటరీ

image

విశాఖలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు. తగరపువలస దగ్గర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ సోమ నాయుడు, జీవీఎంసీ ఆర్ఐ రాజును సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచానికి సంబంధించిన కేసు విషయంలో ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.