News April 13, 2024

విశాఖ: రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య

image

విశాఖపట్నం అరిలోవ కృష్ణపురంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. యువకుడిని రాళ్లతో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 

Similar News

News October 6, 2025

విశాఖకు టాటా గ్రూప్ చైర్మన్‌ను ఆహ్వానించిన మంత్రి

image

టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబైలో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో ఈ నెలలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధిలో టాటా భాగ‌స్వామ్యం కావాల‌ని, అన్ని రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు.

News October 6, 2025

ఏయూ: ఎంటెక్ ఈవినింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

స్థానికంగా ఉద్యోగాలు చేస్తున్నవారికి ఎంటెక్ ఈవినింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగిన వారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 17వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి, అర్హత కలిగిన వారికి ప్రవేశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్సైట్, ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో సంప్రదించాలి.

News October 6, 2025

పీజీఆర్ఎస్ అర్జీలపై విశాఖ కలెక్టర్ సీరియస్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీల పరిష్కారంలో జాప్యంపై అధికారుల తీరుపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అర్జీలు రీ-ఓపెన్ కాకుండా, సక్రమంగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ తీరును తప్పుబట్టారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు ఇవ్వాలని డీఆర్వోను ఆదేశించారు.