News April 21, 2024
విశాఖ: రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడుపుతోందని వాల్తేర్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తెలిపారు. దేశ వ్యాప్తంగా 9,111 ట్రిప్పులను నడుపుతుండగా, గతేడాది కంటే 2,742 ట్రిప్పులు అధికమన్నారు. వాల్తేర్ డివిజన్‌లో 52 వేసవి ప్రత్యేక సర్వీసులు తిరుగుతున్నాయని, మరో 12 జతలు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు.
Similar News
News October 10, 2025
విశాఖ: అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 20 దరఖాస్తులు

IDCS విశాఖ అర్బన్ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో 2 కార్యకర్తల పోస్టులు, 21 ఆయాల పోస్టుల నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు నేటితో గడువు ముగిసింది. 2 కార్యకర్తల పోస్టులకు 20 దరఖాస్తులు వచ్చినట్లు అర్బన్ సీడీపీవో నీలిమ శుక్రవారం తెలిపారు. 21 ఆయా పోస్టులకు 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు సమాచారం అందిస్తామన్నారు.
News October 10, 2025
విశాఖ: హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు

విశాఖ వేదికగా VCA – ADCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 12న (ఆదివారం) ఇండియా V/S ఆస్ట్రేలియా ఉమెన్స్ తలపడనున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ జరిగిన మ్యాచులో సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ చేతిలో ఇండియా ఉమెన్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆదివారం సెలవు రోజు కావటంతో అధిక సంఖ్యలో క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
News October 10, 2025
కంచరపాలెం చోరీ కేసులో వీడిన చిక్కుముడి?

కంచరపాలెం ఇందిరానగర్-5 <<17927881>>దొంగతనం కేసు<<>>లో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయినట్లు సమాచారం. బాధిత కుటుంబంలో ఓ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనే పథకం ప్రకారం ఈ దోపిడీకి ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ నెల 5 అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లయ్యమ్మ(73)నోట్లో గుడ్డలు కుక్కి 12 తులాల బంగారు, కారు, కొంత నగదుతో దుండగలు పరారయ్యారు. కంచరపాలెం క్రైంపోలీసులు కేసును తమైదన శైలిలో విచారిస్తున్నారు.