News February 25, 2026

విశాఖ: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి టోకరా.. రూ.89 లక్షలు దోచేశాడు

image

నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి‌కి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News February 27, 2026

కన్నీళ్లు పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో <<19251338>>క్లీన్‌చిట్<<>> లభించడంతో అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు వద్ద తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘కేజ్రీవాల్ తప్పు చేయలేదు. ఆప్ పార్టీ తప్పు చేయలేదు. మోదీ ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. మా పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారు’ అని విమర్శించారు. కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకున్న సందర్భంగా భార్య, కూతురి ఆనందం అవధులు దాటింది.

News February 27, 2026

HYD: ప్రేమ వివాహం.. యువకుడిపై యువతి సోదరుడి దాడి

image

ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై దాడి చేశారు కొందరు దుండగులు. నేరెడ్‌మెట్‌కు చెందిన అజయ్‌ను రామలింగంపల్లి గ్రామ శివారులోకి పిలిపించి యువతి సోదరుడు, అతని స్నేహితులు కారం చల్లి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

News February 27, 2026

నిర్మల్: మార్చి 4 నుంచి ‘సదరం’ క్యాంపులు

image

జిల్లాలో మార్చి 4వ తేదీ నుంచి 31 వరకు వివిధ కేటగిరీల దివ్యాంగులకు ‘సదరం’ క్యాంపులు నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఓ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని, మొబైల్ ఫోన్‌కు సమాచారం అందిన వారు మాత్రమే కేటాయించిన కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంట అవసరమైన ధ్రువపత్రాలను తీసుకురావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.