News March 10, 2026

విశాఖ రుషికొండలో ‘క్రౌన్ ప్లాజా’ హోటల్

image

విశాఖపట్నం రుషికొండలో ‘కోస్టల్ హాస్పిటాలిటీ ప్రిసింక్ట్’ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని ‘క్రౌన్ ప్లాజా’ బ్రాండ్‌తో కె.పి.సి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించనుంది. సుమారు ₹280.51 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ద్వారా 310 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పర్యాటక పాలసీ 2024-29లో భాగంగా ప్రభుత్వం భూమిని, ప్రోత్సాహకాలను కేటాయించింది.

Similar News

News April 20, 2026

భీమిలిలో వ్యక్తి ఆత్మహత్య

image

భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మైలపల్లి సతీశ్ (35) చాకుతో చేతిని కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలే ఈ ఘటనకు కారణమని భీమిలి ఎస్ఐ సురేశ్ తెలిపారు.

News April 20, 2026

విశాఖ రైతు బజార్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

విశాఖలోని పలు రైతు బజార్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జేసీ విద్యాధరి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పెందుర్తి రైతుబజార్‌లో నైట్ వాచ్‌మెన్‌ కమ్ స్వీపర్, సీతమ్మధార రైతుబజార్‌లో నైట్ వాచ్‌మెన్, సీతమ్మధార రైతుబజార్‌లో స్వీపర్, ఆరిలోవ రైతుబజార్‌లో డే వాచ్‌మెన్‌ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు గోపాలపట్నం ఉప మార్కెటింగ్ సంచాలకులకు ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

News April 20, 2026

విశాఖ – భువనేశ్వర్ స్పెషల్ రైలు (08512) రీషెడ్యూల్

image

సింహాచలం చందనోత్సవం సందర్భంగా ప్రకటించిన 08512 నంబర్ గల విశాఖపట్నం – భువనేశ్వర్ స్పెషల్ జనసాధారణ్ రైలు రీషెడ్యూల్ అయింది. ఈ రైలు ఏప్రిల్ 20న ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.