News December 19, 2025

విశాఖ రుషికొండ బిల్డింగ్‌పై జగన్ ఏమన్నారంటే?

image

AP: మెడికల్‌ కాలేజీల అంశంపై గవర్నర్‌ను కలిసిన అనంతరం YCP చీఫ్ జగన్ విశాఖ రుషికొండ నిర్మాణాలపై స్పందించారు. ‘మా హయాంలో రుషికొండపై రూ.230CRతో బ్రహ్మాండమైన బిల్డింగ్‌ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికమైంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు యోగా డే కోసం అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామగ్రి కొనుగోలులోనూ అవినీతికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు.

Similar News

News December 19, 2025

యూరియా బుకింగ్.. 24hrsలోగా తీసుకోకపోతే..

image

TG: యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ <<18577487>>యాప్<<>> ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. యాప్‌లో బుక్ చేసిన 24 గంటల్లోగా వెళ్తేనే యూరియా బస్తాలు ఇస్తారు. లేదంటే మరో 15 రోజుల వరకు బుకింగ్‌కు అవకాశం ఉండదు. ప్రస్తుతం రైతులకు ఎకరా వరికి రెండున్నర బస్తాలు, మక్క, ఇతర పంటలకు 3 బస్తాలు, మిర్చికి 5 బస్తాల లిమిట్ పెట్టారు. బుక్ చేసుకున్న గంట తర్వాత నుంచే బస్తాలు తీసుకోవచ్చు.

News December 19, 2025

గులాబీ, మల్లె తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

ఈ సమయంలో గులాబి తోటలను ఆకు, మొగ్గ తొలుచు పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి స్పైనోశాడ్ 0.3ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3ml కలిపి పిచికారీ చేయాలి. మల్లె తోటల్లో ఇప్పటికే ఆకులను తీసేస్తే ప్రతి మొక్కకు 8 నుంచి 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 90 గ్రా. నత్రజని, 120గ్రా. భాస్వరం, పొటాష్ ఎరువులను కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే ఇవ్వాలి. దీని వల్ల పూలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.

News December 19, 2025

ఇతిహాసాలు క్విజ్ – 101 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: ఆయన పరమజ్ఞాని. చెకుముకి రాయి నుంచి జన్మించారని చెబుతారు. పుట్టినప్పుడే వేదాలను, శాస్త్రాలను ఔపోసన పట్టారు. ఈయన అడవులకు వెళ్తుండగా ‘పుత్రా.. పుత్రా..’ అని తండ్రి పిలిచినా వెనుతిరిగి చూడలేదు. బదులుగా ప్రకృతిలోని చెట్లు, పుట్టలు ఆ పిలుపుకు బదులిచ్చాయి. ఎవరాయన?
సమాధానం: శుక మహర్షి. ఆయన వ్యాస మహర్షి కుమారుడు.
<<-se>>#Ithihasaluquiz<<>>