News November 15, 2025
విశాఖ: రెండో రోజు 48 ఎంఓయూలు

విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో 48 ఎంఓయూలు జరిగాయి. వైద్యారోగ్యం, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, టెక్స్ టైల్స్, పర్యాటక రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. వీటి ద్వారా రూ.48,430 కోట్ల పెట్టుబడులు, 94,155 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్, సవిత, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.
Similar News
News November 15, 2025
పెద్దపల్లి: పత్తి కొనుగోళ్లు నిలిపివేత.. రైతులు కలెక్టర్ సూచన

CCI జిన్నింగ్ మిల్లులపై విధించిన నిబంధనల సడలింపు వచ్చే వరకు NOV 17నుంచి రాష్ట్రవ్యాప్తంగా CCI, ప్రైవేట్ పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ తెలిపారు. రైతులు మార్కెట్ యార్డులకు, జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకురావొద్దని, స్లాట్ బుకింగ్ ఉన్నవారూ కూడా పత్తి తీసుకురావొద్దని సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పత్తి అమ్మకాలపై రైతులు ఆగాలని కలెక్టర్ విజ్ఞప్తిచేశారు.
News November 15, 2025
పెద్దపల్లి టాస్క్ సెంటర్ విజయం.. 9 మందికి టెలిపర్ఫార్మెన్స్‌లో ఉద్యోగాలు

PDPL టాస్క్ రీజినల్ సెంటర్ శిక్షణతో జిల్లాకు చెందిన 9మంది విద్యార్థులు టెలిపర్ఫార్మెన్స్ కంపెనీలో కంటెంట్ మోడరేటర్‌గా ఎంపికయ్యారు. యూట్యూబ్ ప్రాజెక్ట్‌లో వారికి అవకాశం లభించింది. నైపుణ్యాభివృద్ధి, కమ్యూనికేషన్ శిక్షణ, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా టాస్క్ అందిస్తున్న కోర్సులు యువత భవిష్యత్తుకు దారి చూపుతున్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News November 15, 2025
పెద్దపల్లిలో యూనిటీ మార్చ్.. సర్దార్ పటేల్‌కు ఘన నివాళి

మై భారత్ పెద్దపల్లి ఆధ్వర్యంలో శనివారం గవర్నమెంట్ ఐటీఐలో యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ CH. అంజి రెడ్డి పటేల్ ఐక్యత సందేశాన్ని యువత అనుసరించాలని పిలుపునిచ్చారు. ఐక్యత ప్రతిజ్ఞ అనంతరం ఐటీఐ నుంచి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వరకు పాదయాత్ర సాగింది. అదనపు కలెక్టర్ దాసరి వేణు, DYO వెంకట్ రాంబాబు సహా అధికారులు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్కౌట్స్‌తో కలిపి 750 మంది పాదయాత్రలో పాల్గొన్నారు.


