News December 6, 2024

విశాఖ: ‘రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలి’

image

విశాఖ జిల్లాలో ఈనెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ సదస్సులపై ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలందరూ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా భూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో సదస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News December 12, 2024

వైభవంగా సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవం

image

ఏకాదశి పురస్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవాన్ని బుధవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజు స్వామిని అలంకరించి వాహనంలో అధిష్టింప చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పలువురు స్వామిని దర్శించుకున్నారు.

News December 12, 2024

ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు డిన్నర్

image

రెండో విడ‌త జిల్లా కలెక్టర్ల కాన్ఫ‌రెన్స్‌లో భాగంగా బుధవారం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స‌మావేశమాయ్యారు. కలెక్టర్ల సదస్సు అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్, ఎస్‌పీలు, ఇతర అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు డిన్నర్ చేశారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత ఉన్నారు.

News December 11, 2024

విశాఖ: పలు రైళ్లను రద్దు చేసిన అధికారులు

image

వచ్చేనెల 2 నుంచి 8 వరకు విశాఖ- రాయపూర్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు, 3 నుంచి 9 వరకు రాయపూర్-విశాఖ పాసింజర్ రైలును రద్దు చేసినట్లు వాల్తేర్ డీసీఎం కే.సందీప్ బుధవారం పేర్కొన్నారు. 3 నుంచి 8 వరకు విశాఖ-భవానిపట్నం స్పెషల్ పాసింజర్, విశాఖ-దుర్గ్ ఎక్స్‌ప్రెస్, 4 నుంచి 9 వరకు భవానిపట్నం- విశాఖ ప్యాసింజర్, 3 నుంచి 8 వరకు దుర్గ్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు తెలిపారు.