News March 9, 2025

విశాఖ: రేపటి నుంచి యథావిధిగా పీజీఆర్ఎస్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) వినతుల స్వీకరణ కార్యక్రమం 10వ తేదీ నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా గత కొన్ని వారాల నుంచి రద్దైన సంగతి తెలిసిందే. కోడ్ ముగిసిన క్రమంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News March 10, 2025

విశాఖలో రౌడీ షీటర్స్‌కు కౌన్సెలింగ్

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు సంబంధిత అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా SI సునీత ఆదివారం PMపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలువురు రౌడీ షీటర్స్‌ను సత్ప్రవర్తనతో వ్యవహరించాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News March 9, 2025

ద్వారకానగర్‌లో యువతి ఆత్మహత్య

image

ద్వారకానగర్‌లో ఓ యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రమీల(20) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం ఉదయం రూములో ఉరివేసుకుని చనిపోయింది. యువతి తండ్రి రామినాయుడు ద్వారకానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరి సమాచారం మేరకు ద్వారకానగర్ ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 9, 2025

మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి: హోం మంత్రి

image

సమాజంలో మహిళలు ఎప్పుడూ మహారాణులు గానే నిలుస్తారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితా అన్నారు. ఆదివారం ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు గంగాభవాని, కార్యదర్శి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో హోం మంత్రి అనిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఎప్పుడో మహారాణులుగా నిలుస్తారన్నారు.

error: Content is protected !!