News March 20, 2024
విశాఖ: రైలులో ప్రసవం చేసిన 108 సిబ్బంది

రాయగడ నుంచి విశాఖ వచ్చిన రైలులో బుధవారం ఓ గర్భిణి ప్రసవించింది. మతిస్థిమితం లేని మహిళకు పురుటి నొప్పులు రాగా.. రైల్వే పోలీసులు 108కు సమాచారం అందించారు. స్పందించిన కంచరపాలెం 108 మెడికల్ టెక్నీషియన్ శైలజ, పైలెట్ అప్పారావు హుటాహుటిన రైలు వద్దకు వెళ్లి.. నొప్పులు ఎక్కువ కావడంతో రైలులోనే ప్రసవం చేశారు. అనంతరం తల్లీ బిడ్డలను కేజీహెచ్‌కు తరలించారు. 108 జిల్లా కో-ఆర్డినేటర్ సురేష్ వారిని అభినందించారు.
Similar News
News December 30, 2025
వైకుంఠ ఏకాదశి రద్దీ: సింహాచలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది మంది తరలిరావడంతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు కొండపైకి ద్విచక్ర వాహనాలను నిలిపివేసి, కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని ట్రాఫిక్ విభాగం కోరింది.
News December 30, 2025
విశాఖ: వడ్డీ లేకుండా పన్నుల చెల్లింపు.. రేపటితో గడువు పూర్తి

2025-26 ఆర్దిక సంవత్సరంనకు(1.10.25 – 31.03.26) వరకు జీవీఎంసీకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను వడ్డీ లేకుండా డిసెంబర్ 31లోగా చెల్లించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. గడువులోగా చెల్లించి వడ్డీ చెల్లింపు మినహాయింపు పొందాలన్నారు. ప్రజల సౌకర్యార్ధం జీవీఎంసీ వెబ్ పోర్టల్ (gvmc.gov.in)లో పన్నులు చెల్లించవచ్చని చెప్పారు.
News December 29, 2025
‘సంజీవని నిధి’కి విరాళాలు ఇవ్వండి.. విశాఖ కలెక్టర్ విజ్ఞప్తి

విశాఖ జిల్లాలోని పేదలకు, బాధితులకు అండగా నిలిచేందుకు ‘సంజీవని నిధి’కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో పూలు, కేకులు, బహుమతులకు బదులుగా మానవత్వంతో ఈ నిధికి సాయం చేయాలని కోరారు. ఆసక్తి గల దాతలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతా (50100500766040, IFSC: HDFC0009179) ద్వారా విరాళాలు అందించి సామాజిక బాధ్యతను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


