News February 22, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకోజిపాలెం మెయిన్ రోడ్‌లో పెట్రోల్ బంక్ సమీపంలో బైక్‌ను లారీ ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. బైక్ నంబర్ AP40CS0114 ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News February 22, 2025

విశాఖ నుంచి శ్రీశైలంకు అదనంగా బస్సులు

image

శివరాత్రి సందర్భంగా విశాఖ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రస్తుతం తిరుగుతున్న బస్సునకు అదనంగా బస్సులు నడపనున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 25న విశాఖ నుంచి శ్రీశైలంకు మధ్యాహ్నం 2గంటలకు సూపర్ లగ్జరీ బస్సును సాధారణ బస్సు చార్జితో (రూ.1230/- లు) ద్వారకా బస్సు స్టేషన్ నుంచి నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News February 22, 2025

విశాఖలోని 16 సెంటర్లలో గ్రూప్-2 పరీక్ష: జేసీ

image

విశాఖ జిల్లాలో 16 ఎగ్జామ్స్ సెంటర్లలో రేపు గ్రూప్-2 పరీక్ష నిర్వహించనునట్లు జాయింట్ కలెక్టర్ మాయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్ -2 పరీక్ష ఉండనుందన్నారు. పరీక్షా సమయానికి 15 నిమిషాలు ముందుగా అభ్యర్థులు ఎగ్జామ్స్ సెంటర్లకు హాజరు కావాలన్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో 11,029 అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.

News February 22, 2025

వెంకోజిపాలెం వైపు ట్రాఫిక్ డైవర్షన్

image

విశాఖలో ఇసుకతోట జాతీయ రహదారిపై గ్రూప్-2 అభ్యర్థులు శనివారం ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారు. కొన్ని వాహనాలను వెంకోజిపాలెం మీదుగా ఎంవీపీ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు దారి మళ్ళించారు. మరికొన్ని వాహనాలను హెచ్‌బి కాలనీ మీదుగా సీతమ్మధార వైపు దారి మళ్ళించారు.

error: Content is protected !!