News April 6, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

విశాఖలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మల్కాపురానికి చెందిన సత్యనారాయణ స్కూటీపై కుమార్తె ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డాక్‌యార్డ్ నుంచి మారుతీ సర్కిల్ మీదుగా వెళుతుండగా కొత్త పెట్రోల్ బంక్ వద్ద స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 16, 2025

విశాఖలో ఐదుగురు ఎస్ఐ‌లను రేంజ్‌కు అప్పగింత

image

విశాఖ నగరంలో ఐదుగురు ఎస్ఐలపై పోలీస్ కమిషనర్ శంఖ బత్రబాగ్చి చర్యలు తీసుకున్నారు. తక్షణమే ఈ అధికారులను రేంజ్‌కు అప్పగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. త్రీటౌన్ క్రైమ్ ఎస్ఐ సల్మాన్ బేగ్, టూటౌన్ క్రైమ్ ఎస్ఐ సునీల్, పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్, ఫోర్త్ టౌన్ క్రైమ్ ఎస్ఐ విజయ్‌కుమార్, భీమిలి ఎస్సై భరత్ కుమార్ రాజులు రేంజ్‌కు అప్పగించారు. ఈ చర్య పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.

News December 16, 2025

పోర్టు కళావాణి స్టేడియం స్వాధీనం చేసుకున్న యాజమాన్యం

image

అక్కయ్యపాలెం జాతీయ రహదారి కానుకొని ఉన్న పోర్టు కళా వాణి ఆడిటోరియం లీజు ఒప్పందాలను రద్దు చేసినట్లు విశాఖ పోర్ట్ అథారిటీ యాజమాన్యం ప్రకటించింది. క్రీడా సముదాయం గతంలో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించామని లీజ్ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు పాటించకపోవడంతో రద్దుచేసి నోటీసులు జారీ చేశామని పోర్టు యాజమాన్యం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో స్టేడియం స్వాధీనం చేసుకున్నారు.

News December 16, 2025

స్టీల్ ప్లాంట్ హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు

image

విశాఖ స్టీల్‌ ప్లాంటు హాట్‌ మెటల్‌ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. 3బ్లాస్ట్‌ ఫర్నేసుల ద్వారా రోజుకు19వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఉండగా..24 గంటల్లో 21,012 టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి జరిగింది. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు బ్లాస్ట్‌ ఫర్నేస్‌–1 నుంచి 7,058 టన్నులు, ఫర్నేస్‌–2 నుంచి 6,558 టన్నులు, ఫర్నేస్‌–3 నుంచి 7,396 టన్నులు ఉత్పత్తిచేసి గత రికార్డును అధిగమించారు.