News March 24, 2024
విశాఖ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయ కళాశాల జంక్షన్ వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో మధురవాడ ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ కొండల జస్వంత్ (22) మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 2, 2025
యర్రాజీకి విశాఖ ఎంపీ అభినందనలు
విశాఖ నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఆమెను ఎంపీ భరత్ సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విశాఖ నుంచి అర్జున అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News January 2, 2025
జ్యోతి మరిన్ని లక్ష్యాలను సాధించాలి: శాప్ ఛైర్మన్
విశాఖ నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డుకు ఎంపిక కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఆమె పట్టుదల అంకితభావాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జ్యోతి మరిన్ని లక్ష్యాలను సాధించి యువతకు స్ఫూర్తిని ఇవ్వాలన్నారు. అర్జున అవార్డుకు ఎంపికైన ఆమెను ఆయన అభినందించారు.
News January 2, 2025
ఉ.5గంటల నుంచే ఉత్తరద్వార దర్శనం: సింహాచలం ఈవో
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం ఆలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈనెల 10న సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉదయం 5 గంటల నుంచి పదిన్నర వరకు ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం ఈఓ త్రినాధరావు తెలిపారు. ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.