News November 20, 2024
విశాఖ: లంచ్ బాక్సులో గంజాయి.. ఉద్యోగి అరెస్టు
విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీకి గంజాయి సప్లై చేస్తున్న జైలు హాస్పిటల్ ఫార్మసిస్టు కడియం శ్రీనివాసరావును ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. శ్రీనివాసరావుతో రిమాండ్ ఖైదీ గుర్రాల సాయి పరిచయం ఏర్పాటు చేసుకుని.. ఇంటి నుంచి వచ్చేటప్పుడు తన సోదరుడు గంజాయి ఇస్తాడని, దాన్ని తీసుకొస్తే డబ్బులిస్తానని ఆశ చూపాడు. లంచ్ బాక్సులో 95 గ్రాముల గంజాయిని ఉండలుగా చుట్టి తీసుకురాగా పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News December 3, 2024
విశాఖలో మెట్రో స్టేషన్లపై మీ కామెంట్
విశాఖలో 46.23km మేర 3 కారిడార్లను నిర్మించనునున్న మెట్రో పాజెక్టులో 42 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. <<14776969>>స్టీల్ ప్లాంట్ <<>>నుంచి కొమ్మాది(34.4km) మధ్య 29, గురుద్వార-<<14777184>>పాతపోస్టాఫీసు<<>>(5.08kms)మధ్య 6, తాడిచెట్లపాలెం-<<14777236>>చినవాల్తేర్ <<>>(6.75km) మధ్య 7 స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మరి ఏయే ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో కామెంట్ చెయ్యండి.
News December 3, 2024
తాడిచెట్లపాలెం-చినవాల్తేర్ మధ్య మెట్రో స్టేషన్లు ఇవేనా..!(కారిడార్-3)
తాడిచెట్లపాలెం-<<14773164>>చినవాల్తేర్<<>> (6.75kms) మధ్య 7 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. న్యూరైల్వే కాలనీ, విశాఖ రైల్వేస్టేషన్, అల్లిపురం జంక్షన్-ఆర్టీసీ కాంప్లెక్స్, సంపత్ వినాయక టెంపుల్,సిరిపురం/VUDA, ఆంధ్రాయూనివర్సిటీ, చిన వాల్తేరు వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
News December 3, 2024
గురుద్వార్-ఓల్డ్ పోస్ట్‌ఆఫీస్ మధ్య మెట్రో స్టేషన్లు ఇవేనా..!(కారిడార్-2)
గురుద్వార్ జంక్షన్-<<14773164>>ఓల్డ్ పోస్ట్ ఆఫీస్<<>> మధ్య(5.08kms) ఆరు మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ద్వారకానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబా గార్డెన్స్, సరస్వతీ సర్కిల్ స్టేషన్, పూర్ణా మార్కెట్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ స్టేషన్లు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.