News February 23, 2026
విశాఖ: లారీ ఢీకొని మహిళ దుర్మరణం

విశాఖ పరిధి బీహెచ్‌పీవీ జంక్షన్లో రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం సబ్బవరం (M) ఆరిపాకకు చెందిన ఈశ్వరమ్మ(45) చెప్పులు కొనుగోలు చేసుకునేందుకు బీహెచ్‌పీవీ వద్ద ఓ దుకాణానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో భారీ టిప్పర్ లారీ ఢీకొంది. దీంతో ఆమె తల నుజ్జుయింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకొని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News February 23, 2026
ఒంగోలు: ‘మీకోసం’కు 75 ఫిర్యాదులు

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమానికి 75 ఫిర్యాదులు అందాయని త్వరగా పరిష్కరించాలన్నారు.
News February 23, 2026
సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 16 కేంద్రాలు: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షాల నిర్వహణకు 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ఫస్ట్ ఇయర్ 4046 మంది, సెకండ్ ఇయర్ 4060 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, ఈనెల 25 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమనే నిబంధన తొలగించారని, నిర్ణీత సమయానికి 5 నిమిషాలలోగా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని ఆమె సూచించారు.
News February 23, 2026
గ్రేటర్‌లో కొత్త వెలుగుల జిలుగులు

మూడు ముక్కలైన గ్రేటర్ పాలనలో ఇప్పుడు కొత్త కాంతులు నిండనున్నాయి. EESL తప్పుకోవడంతో వీధి దీపాల నిర్వహణ భారమైనా ప్రభుత్వం పట్టు వదలకుండా CYB, మల్కాజిగిరి, GHMC పరిధిలో ఒకే తరహా వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక జీవో విడుదల కానుంది. ఇకపై నగరం మొత్తం ఒకే రకమైన ప్రకటనల పాలసీ అమల్లోకి రానుంది. డిజిటల్ వెలుగులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సర్కారు అడుగులు వేస్తోంది.


